Politics

ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. టీఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో నిల్చున్నారు. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక పోటీ ఈ ముగ్గురి మధ్య ఉండనుంది. ఈ ఉప ఎన్నిక లో మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈరోజు ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన జరగనుంది. అక్టోబర్ 17 న నామినేషన్ల ఉపసంహరణ. నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 6న ఓట్ల లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు తమ ప్రచారం తో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

About the author

Pradeep